17 July, 2026 | 8:38 PM

Breaking News

మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •  

కళ్లు హాయిగా..

08-06-2025 12:00 AM

కళ్లు అలసినట్టు, పొడిబారినట్టు అనిపి స్తోందా? నొప్పి పుడుతున్నాయా? ఇలాంటి లక్షణాలకు చాలా కారణాలే ఉండొచ్చు. అ న్నింటికన్నా ముఖ్యమైంది కళ్లను అతిగా వాడటం. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ల వంటి పరికరాల తెరలను మరీ ఎక్కువసేపు చూడటం కళ్లను ఒత్తిడికి గురిచేస్తాయి. వయసు మీద పడుతుండటమూ కారణం కావొచ్చు. మరి ఉపశమనం పొందటమెలా? 

* కొన్ని తేలికైన జాగ్రత్తలతో కళ్ల అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. నిపుణులు 20-20-20 సూత్రాన్ని దూరంలో ఉన్న వస్తువులను 20 సెకండ్ల పాటు చూడాలన్న మాట. 

* డిజిటల్ పరికరాలు, టీవీలను చూస్తున్నప్పుడు తరచూ రెప్పలు ఆడించేలా చూసుకోవాలి. 

* అరచేతులను కాసేపు రుద్దుకొని, వెంటనే కళ్ల మీద పెట్టుకుంటే కొద్దిగా అలసట తగ్గుతుంది. 

* పిల్లలను ఆరుబయట ఆడుకో నివ్వట మూమేలే. దీంతో దూ రంగా ఉండే వస్తువులను ఎక్కువగా చూస్తారు. కళ్లకు హాయి కలుగుతుం ది. ఇది హ్రస్వదృష్టి తగ్గ టానికీ తోడ్పడుతుంది. 

* కళ్లు పొడిబారినప్పుడు కృత్రిమ కన్నీటి చుక్కలను వేసుకోవచ్చు. దీంతో కళ్లలో తడి మెరుగవుతుంది. 

* ఇంట్లో గాలి మరీ పొడిబారకుండా చూసు కోవాలి. వీలైతే హ్యుమిడి ఫయర్ పెట్టుకోవాలి. ఎయిర్ కండిషనర్‌ను పరిమితంగా వాడుకోవాలి. 

* ఎండలో బయటకు వెళ్లినప్పుడు చలు వద్దాలు ధరించాలి. యూవీఏ, యూవీబీ రేడియేషన్ రెండింటినీ 99 నుంచి 100 శాతం వరకూ నిలువరించే సన్‌గ్లాసెస్ ఎంచుకోవాలి. 

* ఎప్పటికప్పుడు చూపును పరీక్షించుకొని కళ్లద్దాలు, కాంటాక్టు లెన్సులను సరిచే సుకోవాలి. 

* ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. మం చి ఆహారం తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలాంటి మంచి అలవాట్లతో కంటి, చూపు సమస్యలకు దారితీసే జబ్బుల ముప్పు తగ్గుతుంది. 

* ధూమపానం అలవాటుంటే వెంటనే మానేవేయాలి. ఇంట్లోనూ పొగలేవీ లేకుండా చూ సుకోవాలి.