23-02-2026 12:00:00 AM
పేదల ఇండ్లు కూల్చి మెగా కృష్ణారెడ్డికి భూములు కట్టబెట్టే కుట్ర
పేదలకు డబ్బుల్లేవనే సీఎంకి.. వందల కోట్లతో క్యాంపు ఆఫీసులకు పైసలెక్కడివి
కేసీఆర్ బతుకులను నిలబెడితే.. రేవంత్‌రెడ్డి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతుండు
మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి
బాధితుల పక్షాన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : రేవంత్‌రెడ్డి చేసేది మూసీ సుందరీ కరణ కాదు.. రియల్ ఎస్టేట్ దోపిడీ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం ఏం చేసినా దాని వెనుక రియ ల్ ఎస్టే ట్ వ్యాపారం, వేసే ప్రతి అడుగులోనూ భూ ముల పంచాయితీలే ఉంటాయ ని విమర్శించారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్‌మెంట్ బాధిత కుటుంబాలను మాజీ మం త్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఇంచార్జి కార్తీక్ రెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌రావు పరామర్శించి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షా ళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదని, పూటకో తీరుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలోకి వదిలేందుకు డీపీఆర్‌లను కూడా కేసీఆర్ ప్రభుత్వం తయారు చేయించిందని, అప్పుడు మా ప్రభుత్వానికి ఏ ఒక్క ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదన్నారు.
రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఒక్క ఇల్లు కట్టింది లేదు..
సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుం జుకుందామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, ఎల్టీపీఎస్ భూ ములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేయాలని ఆలోచన చేశారని, ఫార్మాసిటీ కోసం కేసీఆర్ 14,000 ఎకరాలు సేకరిస్తే.. దాన్ని ఫోర్త్ సిటీ అని పేరు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట మీ ఇండ్లు కూల్చి, మీ భూములు లా క్కొని.. వాటిని అంబానీకో, అదానీకో, మెగా కృష్ణారెడ్డికో కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కూల్చిన బతుకులు, కూల్చిన ఇం డ్లు తప్ప కట్టిన ఇల్లు ఒక్కటీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అభివృద్ధి పనులు చేసేందుకు లేని డబ్బులు జూబ్లీహిల్స్‌లో రూ. 100 కోట్లతో సీఎం క్యాంపు ఆఫీస్, రూ. 5 కోట్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మూడో క్యాంపు ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఎక్కడివని ప్రశ్నించారు. మేం మూసీ శుద్ధికి వ్యతిరేకం కాదని, ఎస్టీపీలు కట్టు, మురుగునీరు రాకుండా చేయాలని, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పైపులైన్లతో గోదావరి నీళ్ల తో మూ సీని శుద్ధి చేయాలని సూచించారు. బాపు ఘాట్ వద్ద అహింసా మూర్తి గాంధీ విగ్ర హం, నిర్మాణం పేరిట ప్రజల ఇండ్లు కూల్చాలనుకోవడం దుర్మార్గమన్నారు.
నోటీసులను వెనక్కి తీసుకోవాలి..
ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేదు.. ఎఫ్‌టీఎల్ ఫిక్స్ కాలేదు.. ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ రాలేదు.. కనీ సం సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ కూడా జరగలేదు.. అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం బేషజాలకు, పట్టింపులకు పోకుండా.. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్కనే ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి,
వాటిని డెవలప్ చేసుకోవాలని, అంతే కానీ మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను ఛిద్రం చేయవద్దని సూచించారు. మా ఇం డ్లు కూలగొట్టే బదులు.. మా నీళ్ల ట్యాంకులో విషం కలిపితే మేమంతా తాగి చచ్చిపోతాం.. మమ్మల్ని చంపండి అని ఇక్కడ ఒక తల్లి అన్న మాట నన్ను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ ఆం దోళన చెందవద్దని, వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అక్రమాలపై ఎంత దూరమైనా వెళతామని, బీఆర్‌ఎస్ పార్టీ, పక్షాన మీకు అండగా నిలబడి పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.