చెట్లు నరికివేతపై ఫిర్యాదు
18-08-2026 04:51 PM
బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలం బర్దిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలకు నీడనిచ్చే చెట్లను అనుమతులు లేకుండా నరికివేశారని గ్రామస్థులు ఆరోపించారు. విద్యుత్ తీగల సమస్య ఉంటే కొమ్మలను మాత్రమే తొలగించాల్సి ఉండగా, చెట్లను పూర్తిగా నరికివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్య లు తీసుకోవాలని కోరుతూ బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారికి వినతిపత్రం అందజేశారు. కొత్త మొక్కలను నాటించాలని కోరారు.






