calender_icon.png 10 February, 2026 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుర పోరుకు సర్వం సిద్ధం. !

10-02-2026 06:20:56 PM

 - నేడు పోలింగ్

- పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది

-  ఏర్పాట్లు పూర్తి

- సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ

- బస్సుల్లో పీఎస్ లకు చేరిన సిబ్బంది

- పోలీసు విధులపై  ఏసీపీ రవికుమార్ మార్గదర్శకం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పుర పోరుకు సర్వం సిద్ధం చేశారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు పోలింగ్ కు సంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. 34 వార్డులకు గాను 44,575  ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజల సౌకర్యార్థం 68 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 340 పోలింగ్ సిబ్బంది. 200 మంది పోలీసు సిబ్బందిని నియమించారు.

ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు. పట్టణంలోని బజార్ ఏరియా ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటరు లోఎన్నికల సాంగ్రీని పంపిణీ చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లోలకు పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామగ్రితో తరలి వెళ్లారు. మునిసిపల్ ఎన్నికల్లో నిర్వహణ ఏర్పాట్లను  బెల్లంపల్లి మునిసిపల్  ఎన్నికల అధికారి సంపత్ రెడ్డి పర్యవేక్షంలో ఎన్నికల సామాగ్రి, ఎన్నికల ఏర్పాట్లు జరిగాయి.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎన్నికల పరిశీలకుడు గంగాధర్ సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఏ లోటు లేకుండా ఎన్నికల ఏర్పాట్లు ఉండాలని ఆర్ ఓ సంపత్ రెడ్డి ను ఆదేశించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ లో బెల్లంపల్లి మునిసిపల్ కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంపత్ రెడ్డి, బెల్లంపల్లి తహసిల్దార్ లౌడియా కృష్ణ పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏసీపీ ఎన్నికలను పురస్కరించుకొని డిస్ట్రిబ్యూషన్ సెంటరులో ఏర్పాటు చేసిన పోలీస్ రిసెప్షన్ సెంటర్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన  ఎన్నికల నిర్వహణ లో పోలీసులు బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య. ఎనిల్ల నిర్వహణకు అవసరమైన భద్రత చర్యలు తీసుకుంటామన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే చేయాలని కోరారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేలాచర్యలు  తీసుకోవాలన్నారు. బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు, బెల్లంపల్లి, కన్నెపల్లి, మాదారం ఎస్ఐలు కిరణ్ కుమార్,భాస్కర్, ప్రసాద్, సౌజన్య, పోలీసు అధికారులు. సిబ్బంది పాల్గొన్నారు.