6 June, 2026 | 9:04 PM

ప్రతి ఒక్కరూ భక్తి భావన కలిగి ఉండాలి

06-06-2026 03:02 PM

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత....

టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ధర్మచార్యులు మేంగాని చంద్రశేఖర్.... ఎల్లంకి వైకుంఠం 

సుల్తానాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి భక్తి భావన అవసరమని, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందని టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ పెద్దపల్లి జిల్లా ధర్మచార్యులు మేంగానీ చంద్రశేఖర్, ధర్మ ప్రచార పరిషత్ వ్యాఖ్యాత  ఎల్లంకి వైకుంఠం లు అన్నారు ,  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు రెండు నుంచి ఆరు వరకు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా నేడు భజన కార్యక్రమాలు  కోలాహలం తో  ఈ కార్యక్రమం ముగిసింది.

టీటీడీ ధర్మ ప్రచార పరిషత్  పెద్దపల్లి జిల్లా ధర్మాచార్యులు మెంగని చంద్రశేఖర్ పాల్గొని భక్తి భావం గురించి, టిటిడి కార్యక్రమాల గురించి వివరించారు,వాసవి మాత దేవాలయం  చైర్మన్ చకిలం మారుతి, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమురవెల్లి రామ్మూర్తి , అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, వాసవి క్లబ్ అధ్యక్షులు రామీడి రవీందర్ పలువురు పాల్గొన్నారు, అనంతరం ఆలయ కమిటీ శాలువాలతో సత్కరించడం జరిగింది, అర్చకులు వల్లకొండ మఠం మహేష్ ప్రత్యేక పూజలు చేశారు,  అనంతరం ఈ కార్యక్రమాన్ని టిటిడి ద్వారా ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాల అధికారి రామిరెడ్డి కృష్ణమూర్తి కి ఈ గ్రామం ఈ దేవాలయ భక్త బృందం తరఫున చంద్రశేఖర్, వైకుంఠం లు కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ వ్యాఖ్యాత ఎల్లంకి వైకుంఠం వచ్చిన భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడంతో పాటు, అమ్మవారి ప్రసాదం,మిఠాయిలు పంపిణీ చేశారు... పెద్ద ఎత్తున భక్తులు మహిళలు పాల్గొన్నారు...