6 June, 2026 | 10:08 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

జర్నలిస్టు మిత్రులకు రెయిన్‌కోట్లు పంపిణీ

06-06-2026 03:00 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, జూన్ 6 (విజయక్రాంతి): వర్షాకాలంలో విధులు నిర్వహించే జర్నలిస్టులకు ఉపయోగపడేలా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం రెయిన్‌కోట్లను పంపిణీ చేశారు.కలెక్టరేట్‌ సమావేశం హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్  మీడియా ప్రతినిధులకు రెయిన్‌కోట్లు ను కలెక్టర్ అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ మాట్లాడుతూ, ఎండలు, వర్షాలు, ఇతర ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలకు సమయానుకూలంగా సమాచారాన్ని చేరవేస్తూ జర్నలిస్టులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని అన్నారు. 

వర్షాకాలంలో వార్తల సేకరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటించే మీడియా ప్రతినిధులకు రెయిన్‌కోట్లు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా పరిపాలనకు మీడియా ఎల్లప్పుడూ సహకరిస్తోందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ ఎన్ వి గిరి, డి పి ఆర్ ఓ తిరుమల, జిల్లా పంచాయతీ అధికారి మురళి,  జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రింట్ అండ్,ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సమాచార శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.