26 February, 2026 | 9:38 PM

ప్రాణాల విలువను అందరూ తెలుసుకోవాలి

26-02-2026 12:00 AM

కుబీర్, ఫిబ్రవరి24 (విజయక్రాంతి): ప్రతి వ్యక్తి వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాల విలువ తెలుసుకోవాలని నిర్మల్ ఎస్పీ జానిక షర్మిల అన్నారు. బుధవారం కుబీర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ ఆలైవ్ 2026’ అవగాహన సదస్సును ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను పోలీస్ శాఖ నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాజేష్ మీనా సాయికిరణ్ ఉన్నారు.