అన్న దాత కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): అన్నదాత కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుభరోసా నిధుల విడుదల చేపథ్యంలో ఆదివారం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. ‘అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా.
70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9,000 కోట్ల రైతుభరోసా నిధుల విడుదలకు ఆదివారం శ్రీకారం చుడుతున్నాం. సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలుచేస్తున్నాం. ఆర్ధిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తిచేసి రైతు లోకానికి అంకితం చేస్తున్నాం. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం’ అని సీఎం పోస్ట్‌చేశారు.




