16 July, 2026 | 3:08 AM

కాంగ్రెస్ అధిష్ఠానానికి ఈశ్వరమ్మ ఫిర్యాదు

16-07-2026 12:00 AM

ఎల్బీనగర్, జులై 15 : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్ఠానానికి యాదాద్రి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎల్బీనగర్ ఇన్ చార్జి మధుయాష్కీగౌడ్, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి,

నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యుడు డాక్టర్ మ ల్లు రవి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితరులకు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జక్కిడి శివచరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోచబోయిన సురేష్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు ముద్దగొని రామ్మోహన్ గౌడ్ తదితరులు ఉన్నారు.