16 July, 2026 | 2:46 PM

Breaking News

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం   •   స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలి   •   నీటి విడుదల కోసం రైతుల ధర్నా   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుపై ఎమ్మెల్యే వైఖరి తెలపాలి   •   వర్షం కోసం రైతుల పూజలు   •   జగ్గారం లో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె   •   సీతారామ సాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేకాఫ్ పాయింట్ ను పరిశీలించిన మంత్రులు   •   హిందూ విద్యార్థిని కల్మాను చదవమనడం బాధకరం   •   హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: బండి సంజయ్   •   అమెరికా ఫెడ్ రిజర్వ్ లో ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక బాధ్యతలు   •  

ప్రజలకు అందుబాటులో నిత్యావసర వస్తువులు

08-01-2026 12:30 AM

జవహర్‌నగర్, జనవరి 7,(విజయక్రాంతి): ప్రజల ముంగిటికే తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఫలాలు లభిస్తాయని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్సి శ్రీకాంత్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం వారాంతపు కూర గాయల సంతను శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో శ్రీకాంత్ చారి అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నాణ్యమైన కూరగాయలను సరసమైన ధరలకే అందించాలనే సంకల్పంతో ఈ మార్కె ట్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి వారం జరిగే ఈ సంతను, లక్ష్మీ నరసింహ కాలనీ ప్రజలతోపాటు చుట్టుపక్కల కాలనీ ప్రజలే కాకుం డా జవహర్‌నగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ముఖ్యులు, నాయ కులు మూకర రవి, రంగుల హరికృష్ణ, ఎం. లక్ష్మీనారాయణ, రంగుల శంకర్, జి. నరేష్, కోటగిరి సంతోష్ కుమార్, నగేష్, సుజాత, జ్యోతి, తదితరులు, కాలనీవాసులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.