14 July, 2026 | 11:46 AM

Breaking News

కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •  

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రపహాడ్ సర్పంచ్

14-07-2026 01:11 AM

తాడ్వాయి, జూలై 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు గ్రామ సర్పంచ్ సొంటికే మల్లవ బీరయ్య సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో సర్పంచ్ బీరవ్వకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎర్రపహాడు గ్రామంలో ఎమ్మెల్యే మదన్మోహన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు.

గ్రామంలోని పాఠశాల మరమ్మతుల  కోసం రూ 17 లక్షల ఖర్చు చేశారని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేశారని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందున తాను ఆకర్షితురాలని అయి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి సంజీవులు, నాయకులు గైని శివాజీ, మేకల రాజు, సుధాకర్ రావు, గడ్డం ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.