1 August, 2026 | 6:57 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

06-06-2026 12:00 AM

బోధన్,  జున్ 5 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని కోర్టు ఆవరణలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మొక్కల నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఐదవ అదనపు జిల్లా జడ్జి వరూధిని, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ... అభివృద్ధి పేరుతో మనం పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నామని, దాని ఫలితంగా స్వచ్ఛమైన గాలి, సహజ వాతావరణం తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి పౌరుడు తన బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. చెట్ల పెంపకం ద్వారానే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవనం అందుతుందని తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మొక్కలు నాటండి  పర్యావరణాన్ని కాపాడండిఅనే సందేశాన్ని ప్రజలకు అందించారు.