ఊపందుకుంటున్న ఉపాధి హామీ
18-04-2026 01:44 PM
కూలీల సంఖ్య పెరుగుతున్నది..
బోత్,(విజయ క్రాంతి): మండలంలో ఉపాధి హామీ పనులు వేగవంతమయ్యాయని ప్రతిరోజు కూలీల సంఖ్య పెరుగుతూ వస్తుందని ఎంపీడీవో రమేష్ ఉపాధి హామీ ఎపిఓ జగదేరావు తెలిపారు. శనివారం మండలంలోని బాబేర, బాబేర తాండ ,నిగి నీ, గ్రామాలలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు.ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండల తీవ్రత వల్ల కూలి పనులను సకాలంలో ముగించుకోవాలని సూచించారు. కాగా పని ప్రదేశాలలో కూలీలకు నీటి వసతులను పరిశీలించడం జరిగింది. రబీ పంటల కారణంగా కూలీల సంఖ్యతగ్గిందని 2 200 వరకు కూలీలు ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు అన్నారు.






