24 March, 2026 | 2:59 AM

నగరంలో ఎలివేటెడ్ కారిడార్లు

24-03-2026 01:05 AM
  1. ట్రాఫిక్ రద్దీని నివారించేలా నాలుగు వైపులా నాలుగింటిని ఏర్పాటు చేస్తాం
  2. త్వరలోనే మెట్రో విస్తరణ
  3. మూసీ పరివాహక ప్రాంతవాసులను నిరాశ్రయులను చేయం
  4. అభివృద్ధికి ప్రతిపక్షాలు కలిసి రావాలి
  5. అవసరమైతే క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం
  6. సలహాలు సూచనలు ఇవ్వండి
  7. శాసనమండలిలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్ అద్భు త నగరంగా మారుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నగరానికి నాలుగు వైపు లా.. గౌలిగూడ జంక్షన్, చాదర్ ఘాట్ జం క్షన్, నాగోల్, అంబర్‌పేట జంక్షన్‌లో ఒక్కొక్కటి చొప్పున నాలుగు ఎలివేటెడ్ కారిడా ర్లను నిర్మించనున్నట్టు తెలిపారు. సోమవారం శాసనమండలిలో హైదరాబాద్ అభి వృద్ధి, మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

హైదరాబాద్ రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని అన్నారు. పాత బస్తీ ఓల్డ్ సైట్ అని మనం చెప్పుకుంటున్నా వాస్తవానికి అది ఒరిజినల్ సిటీ అన్నారు. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న నగరంలో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా వాహనాల సంఖ్య పెరిగిందని, వీటికి పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో రెండో స్థానం లో ఉన్న మెట్రో, ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మెట్రో విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మెట్రోపై ఎల్ అండ్‌టీతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించామని, మెట్రోలో లాస్ట్ మైల్ కనెక్టివీటీ లేదని, అందుకే మెట్రోను విస్తరిస్తున్నామని చెప్పారు. మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిచిందని, త్వరలోనే మెట్రో విస్తరణను చేపట్టబోతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల నేపథ్యంలో రూ.15 వేల కోట్లు కేటాయించి మెట్రోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టును మరో 76 కి.మీ. విస్తరిస్తామని చెప్పారు.

మూడు జోన్లుగా తెలంగాణ

తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు జోన్లుగా విభజించామని చెప్పారు. ఔటర్ రింగురోడ్డు ఇన్ సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అని, ఈ ప్రాంతంలోని కాలుష్య కారక పరిశ్రమలకు ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తే మధ్యతరగతికి భూమి అందుబాటు లోకి వస్తుందన్నారు. నగరం నివాస యో గ్యంగామారుతుందని, రోడ్లను అండర్ పా స్, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్ అని మూడు భాగాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.

ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రణాళికలు తీసుకున్నామని, 29 ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుం చి కూడా అండర్ పాస్ రోడ్డుకు అనుమతి తీసుకొచ్చామని, దేశంల్ రన్‌వే కింద ఇలాం టి రోడ్డు ఎక్కడా లేదన్నారు. నల్లగొండ, విజయవాడ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్లను పూర్తి చేసుకుంటున్నామని చెప్పారు. 

అందుకే హిల్ట్ పాలసీ తెచ్చాం

ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి ప్రజ ల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నామని, ఇందుకు చిరు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫుట్ పాత్‌లో ఉండే చిరు వ్యాపారుల కోసం ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సహిస్తామన్నారు.

కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేశామని, సంస్కరణల్లో భాగంగా ఇలాంటి చర్యలను చేపడుతున్నామని, ఢిల్లీ లాంటి నగరంలా  హైదరాబాద్ మారవద్దనే హిల్ట్ పాలసీ తీసుకొచ్చామన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు బయటకు తరలిస్తున్నామని, ఇండస్ట్రియల్ జోన్‌కు మల్టీ జోన్‌గా భూమిని బదలాయిస్తున్నాం తప్ప తాము యాజమాన్య హక్కు లు ఎవరికీ అందించడం లేదన్నారు.

మూసీ ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించామని, 10 వేల స్క్వేర్ కి.మీ పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను మారిస్తే మూసీ సుందరీకరణ త్వరగా పూర్తవుతుందని, 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం, అధికారుల మధ్య సమన్వయం ఉండేలా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి పరిధిని ఒకే విధానం తీసుకొచ్చామన్నారు. 

రాజకీయాలు చేయొద్దు

అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్ష నేతలను సీఎం కోరారు.   మూసీ రీవర్ డెవలమెంట్ కార్పొరేషన్ ప్రా రంభించింది తామే అని సిరిసిల్ల ఎమ్మెల్యే చెప్పాడని కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రారంభించి మీరు వదిలేస్తే మేం ముం దుకు తీసుకెళుతున్నాం.. మీకున్న అభ్యంతరమేంటి? అని ఆయన ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు ఇవ్వాలని కోరారు.

తనకు సూచనలు ఇవ్వడానికి ఇబ్బంది అనుకుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో ఒక క్యాబినెట్ సబ్‌కమిటీ వేస్తానని, వారికి సూచనలు సలహాలు అందించాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న తాము ఎవరినీ నిరాశ్రయులను చేయబోమని, వారికి పునరావాసం కల్పిస్తామని, మెరుగైన వసతులు కల్పిస్తామని సీఎం స్పష్టం చేవా రు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని ఆయన ప్రజలను కోరారు.