కొనసాగుతున్న విద్యుత్ కార్మికుల సమ్మె
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్, ఆన్మాన్, పీస్ రేట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఆసిఫాబాద్ సర్కిల్ కార్యాలయం ముందు టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ ఆత్రం మారుతీ, కన్వీనర్ షేక్ నసీరుద్దీన్ మాట్లాడుతూ... ఒకే సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఒకే సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిసన్ కార్మికులకు APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయడం, ఆన్మాన్ కార్మికులను ఆర్టిసన్‌గా గుర్తించడం, పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడం, 2026 పీఆర్‌సీ వేతన సవరణ ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 150 మంది విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు.




