22 July, 2026 | 1:49 AM

ఇచ్చిన హామీ నెరవేర్చాలని.. విద్యుత్ కార్మికుల నిరసన

22-07-2026 12:08 AM

నేడు ఎస్పీడీసీఎల్ ఎదుట మహా ధర్నా 

మహబూబాబాద్, జులై 21 (విజయక్రాంతి): విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న అర్టిసన్, అన్ మ్యాన్డ్, పీస్ రేటు కార్మికులకు సమ్మె కాలంలో ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రివర్యులు  మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన మాట నిలబెట్టకుని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ అర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ  ఆధ్వర్యంలో ఈనెల 22న టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం, మింట్ కాంపౌండ్,ఖైరతాబాదు (హైదరాబాదు) ఎదుట  మహా ధర్నా నిర్వహించతల పెట్టినట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు.

మహా ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ హజరవుతున్నారని, మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. సర్వీస్ రూల్స్ అమలు కోసం ఒకే విధానం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, ఇతర అలవెన్స్ ల అమలు కోసం గతంలో సమ్మె చేయగా, ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయితే ఇప్పటివరకు ఆ అంశాలపై ఎవరు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదని, దశలవారీగా మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ సంఘం నేతలు తెలిపారు. ఇందులో భాగంగా 22న మహా ధర్నా తర్వాత భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటిస్తామన్నారు.