29 April, 2026 | 10:53 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

వెలిగిన విద్యుత్ లైట్లు..

12-03-2026 12:40 AM
  1. అంబేద్కర్ సెంటర్‌లో తొలగిన చీకట్లు..

‘విజయక్రాంతి’ వార్తకు స్పందన 

కేసముద్రం, మార్చి 11 (విజయక్రాంతి): పురమంతా వెలుగులు.. అంబేద్కర్ సెంటర్ లో చీ కట్లు!? అనే శీర్షికతో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూ డలి అంబేద్కర్ సెంటర్ లో వీధిలైట్లు వెలగగా కటిక చీకట్లో మగ్గుతున్న విషయాన్ని విజయ క్రాంతి పత్రికలో ఈనెల 9న ప్రచురించిన వార్త కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించా రు. అంబేద్కర్ సెంటర్ లో పాడైపోయిన సోలార్ వీధిలైట్ల స్థానంలో 12 35 వాట్స్ ఎల్‌ఈడి లైట్లను కొత్తగా అమర్చారు.

ప్రజలు, రైలు ప్రయాణికులు చీకట్లో రాకపోకలు సాగించడానికి అంబేద్కర్ సెంటర్ వద్ద పడుతున్న ఇబ్బందులు తాత్కాలికంగా తొలగిపోయాయి. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులు పూర్తికాగానే శాశ్వత ప్రాతిపదికన అత్యాధునికమైన ఎల్‌ఈడి వీధిలైట్లను అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతానికి అంబేద్కర్ సెంటర్లో ప్రజలు, రైల్వే స్టేషన్ వెళ్లడానికి ప్రయాణికులకు చీకటి ఇబ్బంది తొలగింప చేశామని చెప్పారు.