హలో బీసీ.. చలో బెంగళూరు
జాతీయ మహాసభల వాల్ పోస్టర్ విడుదల.
గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమ జ్వాలను రగిలిస్తాం.
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు
కామారెడ్డి,(విజయక్రాంతి): హలో బిసి చలో బెంగుళూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివ రాములు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో జరిగిన సమావేశంలో నాయకులు వాల్ పోస్టర్ విడుదల చేసి మాట్లాడుతూ... కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బిసిలను ఏకం చేస్తాం అని,గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని విస్తరించిందికే ఆగస్టు 7న బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నాం అని అన్నారు. బీసీ రిజర్వేషన్లు లేని మహిళా బిల్లు,డి లిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాల్సిందే నన్నారు.
బీసీ లెక్కలు తీసి బీసీల వాటా తేల్చకపోతే జెన్ జీ ఉద్యమం ఇక్కడ కూడా మొదలైతది అన్నారు.దేశవ్యాప్తంగా బిసి ఉద్యమాన్ని విస్తరించడానికి ఆగస్టు ఏడో తేదీన ప్రతి సంవత్సరం జాతీయ ఓబీసీ మహాసభలను ప్రతి రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ఢిల్లీ, ముంబై, నాగపూర్, హైదరాబాద్, తిరుపతి, అమృత్ సర్, గోవా లో నిర్వహించి ఈసారి బెంగుళూరులో నిర్వహిస్తున్నామన్నారు, బెంగళూరులో నిర్వహించే ఈ సభకు దేశం నలుమూలల నుండి వేలాదిమంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు.






