21 July, 2026 | 10:31 PM

Breaking News

జవహర్ నగర్ లో కార్పెంటర్ అదృశ్యం

21-07-2026 08:35 PM

పిఎస్ లో ఫిర్యాదు చేసిన తండ్రి

జవహర్ నగర్,(విజయక్రాంతి): కార్పెంటర్ అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం సాయి కుమార్ (25) గత కొద్ది కాలంగా బాలాజీ నగర్ లో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. గత కొద్ది కాలంగా సాయికుమార్ కార్పెంటర్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం నాలుగున్నర గంటలకు కార్పెంటర్ పని ఉందని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లి ఆ తర్వాత తన సోదరికి ఫోన్ చేసి బంధువులు మందలించడంతో మనసు చెలించిపోయి చనిపోతున్నా అని చెప్పి తన ఫోను స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అతని గురించి చుట్టుపక్కల వెతికిన తెలిసిన వారి వద్ద వెతికిన అతని సమాచారం లభించలేదు. ఈ మేరకు సాయికుమార్ తండ్రి సోమనారాయణ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.