కరీంనగర్ జిల్లా కన్వీనర్‌గా రాపాక శంకర్
21-07-2026 08:22 PM
మానకొండూరు,(విజయక్రాంతి): తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కన్వీనర్‌గా రాపాక శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. నూతనంగా నియమితులైన జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లా మహాసభను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ మహాసభలోనే నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల హక్కుల సాధన, జాతి ఆత్మగౌరవం కోసం సభ్యులందరూ విభేదాలను వీడి, ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.






