ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక
మహబూబాబాద్,(విజయక్రాంతి): అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మహబూబాద్ జిల్లా నాలుగవ మహాసభలో అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆబోతు అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జలగం ప్రవీణ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మెతుకు కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బొడ్డు ఉదయ్, ఇరుగు వెంకటేష్, పబ్బతి మురళి, సహాయ కార్యదర్శులుగా పేరబోయిన క్రాంతి, మునుకుంట్ల రాజు, తేజావత్ వినయ్, కోశాధికారిగా బాదం రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తమ ఎన్నికకు కృషిచేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి, సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి గార్లకు ఆబోతు అశోక్ జలగం ప్రవీణ్ మెతుకు కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.






