28 August, 2026 | 11:29 PM

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఆత్రం సుగుణక్క

28-08-2026 10:13 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్,  ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క నివాసంలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొని సీతక్కతో కలిసి రాఖీలు కట్టుకున్నారు. సీఎం సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్లకు కూడా సుగుణక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.