మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు
పిడియాట్రీషియన్ డాక్టర్ వి.ఎస్.వి ప్రసాద్
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోనే మొదటిసారి ప్రఖ్యాత చిన్న పిల్లల హాస్పిటలైన లోటస్ హాస్పటల్స్ సాంకేతిక సహాకారంతో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(NICU)ను మెడినోవా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పీడియాట్రిషియన్ డాక్టర్ వి.ఎస్.వి ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్,లోటస్ హాస్పటల్స్ వ్యవస్థాపకులు, మెడినోవా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ... అప్పుడే జన్మించిన శిశువులకు సంబంధించి ప్రత్యేక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)ను అందుబాటులోకి తేచ్చామని అన్నారు. అప్పుడే జన్మించిన శిశువుకు సంబంధించి ఇన్ఫెక్షన్ లను,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ అందకపోవడం,పాలు తాగలేకపోవడం, నెలలు నిండకముందే జన్మించిన శిశువులు, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు సంబంధించిన అత్యవసర చికిత్సలు అందించడానికి ఇలాంటి పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని పిల్లల డాక్టర్ ప్రసాద్ వెల్లడించారు.
అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన లెవల్ 3 స్థాయి (NICU) ఆరు పడకలు కలిగి శ్వాసకోస వెంటిలేటర్ సదుపాయం, ఇంక్యుబేటర్ తో పాటు ఉష్ణ సంరక్షణ వంటి పలు రకాల చికిత్సలను అందించడానికి ఇలాంటి పరికరం వినియోగించుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ, సిఈఓ ఐనీష్ మర్చంట్, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సి గీతాలతో పాటు మెడిసిటీ, మెడినోవా ఆసుపత్రులకు చెందిన వైద్యులు వైద్యేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






