6 March, 2026 | 12:17 PM

న్యాయం చేయాలని మందు డబ్బాతో వృద్ధుల ఆందోళన

06-03-2026 10:31 AM

మోతె,(విజయక్రాంతి): మాకు న్యాయం చేయాలని, భూమి పట్టాకై మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ముందు సిరికొండ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు జంపాల నర్సయ్య ఆందోళన నిర్వహించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట  వృధా దంపతులు పురుగుల మందు డబ్బాలతో  ఆవేదన తో మాట్లాడారు. గడిసిన 15 సంవత్సరాలనుండి సర్వే నెంబర్ 852 మరియు 850 గల మాభూమి సుమారు 7 ఎకరాలు పట్టాకాకుండా, మా పాలి భాగస్థులైన జంపాల పుల్లయ్య, నర్సయ్య, జానయ్య ,లు అధికార పార్టీ నాయకుల అండతో మా భూమి మీదకు మాకు పోనీయకుండా దాడులు చేస్తున్నారని, దౌర్జన్యంతో మాకు భూమి దక్కకుండా చేస్తున్నారని, బోరుమంటు విలపించారు.

మాపై గ్రామంలో కొందరు దాడులు చేస్తున్నారని, పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయడం జరిగిందని కన్నీటి పార్వతమైయ్యారు. నాకు ఉన్న ఇంటి స్థలం పైనను జులుం చేసి ఆక్రమణ చేశారని తెలిపారు. గడిసిన 4 సంవత్సరాల క్రితం తహసీల్దార్ కాసులకు కక్కుర్తి పడి మా భూమిని  మాకు తెల్వకుండా పట్టా చేశారని, వెంటనే పట్టా రద్దు చేసి మాకు పట్టా ఇప్పంచాలని అధికారులను, వేడుకొన్నారు. ఎవరికీ చెప్పిన ఏమి లాభం లేదని న్యాయం జరగడం లేదని, పురుగుల మందు డబ్బతో భార్య భర్తలు, నిరసన చెప్పట్టడంతో కార్యాలయం సిబ్బంది మందు డబ్బాలు బలవంతం గా గుంజుకోవడం జరిగింది.  గడిసిన 4 సంవత్సరాల క్రితం అట్టి భూమి పట్టా చేశారు. నా కంటే ముందు ముగ్గురు తహసీల్దార్ లు మారారు. భూమి సమస్య అన్న దమ్ముల భాగస్వామ్యంతో ఏర్పడిన వివాదం సుమారు 15 సంవత్సరాలనుండి భూమి బీడు గా ఉన్నది వృద్ధులు అయిన నర్సయ్య దంపతులు భూమిని సాగు చేసుకుంటే భూమికి పట్టా ను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.