24 July, 2026 | 10:38 AM

ఎస్సారెస్పీ లోకి స్వల్పంగా ఇన్ ఫ్లో

24-07-2026 09:34 AM

అర్మూర్,(విజయక్రాంతి) : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఆయన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి(Sriramsagar Project)  ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది. మహారాష్ట్రలో  ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఈ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 2662 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు 80.5 టిఎంసిలగాను ప్రస్తుతం ప్రాజెక్టులో 1064.70 అడుగులకు 15.67 టీఎంసీల నీరు నిలువ ఉంది. గత ఏడాది ఇదే రోజున 1068.70 గాను 21.19 టిఎంసిల నీరు నిలువ ఉండింది. ప్రస్తుతం 751 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువకు 250 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 50 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 108 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.