చేపల వలలో చిక్కుకొని వృద్ధుడు మృతి
02-03-2026 12:00 AM
మహబూబాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలోని రాములు తండ గ్రామ శివారు బానోత్ తండా కు చెందిన భానోత్ నరసింహ (65) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చేపలవలలో చిక్కుకొని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు దర్యాప్తు చేసుకొని విచారణ చేపట్టారు.




