24 April, 2026 | 4:39 PM

Breaking News

గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు అంగన్వాడిల ద్వారా సేవలు అందించాలి   •   మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ ఆడారపు హరికృష్ణ   •   దళితుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించండి   •   పేదల పెన్నిధి - సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి   •   ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎంపీడీవో   •   పాసయ్యమన్న ఆనందం బడికి దూరం అవుతున్నామన్న బాధ   •   సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే   •   శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్యే   •   రీస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడికి అభినందనలు   •   ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్‌ షాక్.. బీజేపీలోకి రాజ్యసభ సభ్యులు   •  

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు

29-11-2025 06:58 PM

* నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్...

ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా పోలీసు చర్యలు చేపడుతున్నట్టు, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారుల ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో చివరి రోజు నామినేషన్ సందర్భంగా శనివారం ఇచ్చోడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ ప్రక్రియను ఎస్పీ పరిశీలించారు.

చివరి రోజు కావడంతో భారీ ఎత్తున ప్రజలు క్యూ కట్టి తమ గ్రామ పంచాయతీల పరిధిలో తమ సత్తా చాటుకోవడానికి నామినేషన్ దాఖలు చేయడంతో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఇచ్చోడ గ్రామ పంచాయతీ భవనంలో ఇచ్చోడ, దుబాయ్ పేట్, అడేగామా కె, అడేగామా (బి) గ్రామాల నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. దాని పరిశీలించి ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ పూర్తి కావాలని అధికారుల ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా నాలుగు చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో మూడు అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లు జైనథ్ పిప్పర్ వాడ, బోథ్ ఘన్పూర్, తలమడుగు లక్ష్మీపూర్ లలో అదే విధంగా జాతీయ రహదారిపై నేరడిగొండ నందు రోల్ మామడ చెక్పోస్ట్ ద్వారా ఎన్నికలలో ప్రభావితం చేయకుండా డబ్బు, మద్యం, ఇతరత్రా సామాగ్రి తరలకుండా పర్యవేక్షించడం జరుగుతుంది.