24 April, 2026 | 5:46 PM

రీస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడికి అభినందనలు

24-04-2026 04:16 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండల కేంద్రమునకు చెందిన  పోతబత్తిని శ్రీనివాస్ రేస్ (రూరల్ అసోసియేషన్ యూత్ ఆఫ్ ది ఫోర్స్ సోషల్ డెవలప్ మెంట్) అధ్యక్షుడిని ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు శుక్రవారం అభినందించి శాలువాతో సన్మానించి రేస్ సంస్థ చేపడుతున్న పలు సేవాకార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలకు విద్యార్థులకు యువతకు చేయూతనందిస్తూ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న రేస్ సంస్థ అధ్యక్షుడికి అభినందనీయమని పేర్కొన్నారు. ముందుముందు రేస్ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  రవివర్మ, రామయ్య,శివ, సైదులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.