calender_icon.png 23 February, 2026 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేపాల్‌లో బస్సుప్రమాదం: 18 మంది మృతి

23-02-2026 02:29:52 PM

ఖాట్మండు: నేపాల్‌లోని(Nepal) ధాడింగ్ జిల్లాలోని గజురి సమీపంలో సోమవారం తెల్లవారుజామున త్రిశూలి నదిలో(Trishuli River) ప్రయాణీకుల బస్సు(Bus Accident) పడిపోవడంతో కనీసం 18 మంది మరణించారని పోలీసులు వెల్లడించారు.  పోఖారా నుండి ఖాట్మండు వైపు ప్రయాణిస్తున్న బస్సు తెల్లవారుజామున 1.30 గంటలకు ఖాట్మండుకు పశ్చిమాన 90 కి.మీ దూరంలో ఉన్న పృథ్వీ హైవే వెంబడి త్రిశూలి నదిలోకి పడిపోవడంతో జరిగిన ప్రమాదంలో ఇరవై ఆరు మంది ప్రయాణికులు గాయపడ్డారని సాయుధ పోలీసు దళ ప్రతినిధి బిష్ణు ప్రసాద్ భట్టా తెలిపారు.

ప్రమాద స్థలం నుండి పదిహేడు మృతదేహాలను వెలికితీశామని, 28 మంది గాయపడిన ప్రయాణికులను బస్సు నుండి రక్షించామని  బిష్ణు ప్రసాద్ భట్టా తెలిపారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం వివిధ ఆసుపత్రులలో చేర్చారు. నేపాల్ సైన్యం(Nepal Army), సాయుధ పోలీసు దళం, నేపాల్ పోలీసు సిబ్బందిని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మరణించిన వారిలో ఒక పురుష ప్రయాణీకుడు న్యూజిలాండ్‌కు చెందినవాడు. ఈ సంఘటనలో గాయపడిన వారిలో ఒక జపనీస్, ఒక డచ్ జాతీయుడు ఉన్నారు. ఇద్దరూ మహిళలు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడనప్పటికీ, అతి వేగం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు.