calender_icon.png 23 February, 2026 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'ఇరాన్‌ను తక్షణమే వీడండి' భారతీయులకు అడ్వైజరీ

23-02-2026 02:42:00 PM

న్యూఢిల్లీ: ఇరాన్‌లో ఉన్న భారతీయులకు కేంద్రప్రభుత్వం(Central Government) కీలక సూచనలు జారీ చేసింది. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు వీలైనంత త్వరగా ఇరాన్ నుంచి రావాలని కేంద్రం సూచించింది. అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా త్వరగా రావాలని కోరింది. పాస్ పోర్టులు, ఐడీ కార్డులు తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఇరాన్ లో నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపింది. ఇరాన్ లోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని సూచనలు చేసింది.