24 July, 2026 | 7:39 PM

గౌతమ్ స్కూల్‌లో వనమహోత్సవం, మెహందీ వేడుకలు

24-07-2026 06:53 PM

వేములవాడ,(విజయక్రాంతి): గౌతమ్ మోడల్ స్కూల్‌లో శుక్రవారం వనమహోత్సవం, ఆషాఢ మాసం సందర్భంగా మెహందీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థినులు మెహందీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కరస్పాండెంట్ బూర ఉమా రమేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరికిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.