పర్యావరణ పరిరక్షణ కోసం సదస్సు
డంపింగ్ యార్డ్ పై ఈనెల 26న స్వర్ణాంధ్ర డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో అవగాహన సదస్సు
మేడ్చల్ డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కు ఆహ్వానం
జవహర్ నగర్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ఆరోగ్య భద్రత కోసం జరుగుతున్న అవగాహన సదస్సును విజయవంతం చేయాలని డంపింగ్ యార్డ్ పై ఈనెల 26న స్వర్ణాంధ్ర డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే అవగాహన సదస్సుకు పెద్ద ఎత్తున హాజరుకావాలని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి శివ బాబు పిలుపునిచ్చారు. చెత్త డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఈనెల 26వ తేదీన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ఆరోగ్య భద్రత జీవించే హక్కు పై డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న అవగాహన సదస్సుకు మేడ్చల్ డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ ను శుక్రవారం కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, రమేష్ చారి, సామాజిక నాయకులు బూడిద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






