పేద ఆడబిడ్డ పెళ్లికి అండగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు
14-03-2026 05:33 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ లో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన బాలసాని రజిత-కరుణాకర్ దంపతుల కూతురు ప్రత్యూష వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ శనివారం బియ్యం, పెళ్ళి కూతురు ప్రత్యూష కు పెళ్ళీ చీర అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ... గత 22 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పలు సేవకార్యక్రమాలు చేస్తున్న అన్నారు. ఈ కార్యక్రమంలో గుడ్ల వెంకటేష్, బైరగోని ప్రభాకర్,వేముల అనీల్ పలువురు ఉన్నారు.




