18 June, 2026 | 1:22 AM

ఆదిలాబాద్‌ను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి

18-06-2026 12:01 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, జూన్ 17 (విజయక్రాంతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆదిలాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలోనే మోడల్ ప ట్టణంగా తీర్చిదిద్దేందుకు తమ వంతుగా కృ షి చేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ప్రజలకు మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపా రు. బుధవారం ఆదిలాబాద్ గాంధీ పార్కు తో పాటు వివిధ కాలనీల్లో 18.50 కోట్ల తో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష తో కలిసి ఎ మ్మె ల్యే  భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... రానున్న రోజుల్లో కార్పొరేషన్ గా మారనన్న ఆదిలాబాద్ ము న్సిపాలిటీ నీ గొప్ప నగరంగా మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి కే ఇండస్ట్రీయల్ కారిడార్, ఎయిర్ పోర్టు ని ర్మాణానికి ప్రణాళికలు రూపొందించడం జ రిగిందని పేర్కొన్నారు. పట్టణ జనాభా పెరుగుతున్న తరుణంలో ట్రాఫికు క్రమబద్ధిక రించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపా రు.

పట్టణ ప్రజాల తాగు నీటి పరిష్కారానికి సాత్నాల, మత్తడి, కోరాట-చెనక ప్రాజెక్టుల ద్వారా పైప్ లైన్ వేసి తాగు నీరు అందించేందుకు చర్యలుతీసుకుంటున్నామన్నారు.ఈ కార ్యక్రమంలో కౌన్సిలర్లు ధోని జ్యోతి, గంట జీవన్, బోడిగం శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, నాయకులు బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.