27 August, 2026 | 3:44 AM

ఘోర రోడ్డు ప్రమాదం

27-08-2026 02:38 AM
  1. కోదాడ వద్ద కంటైనర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
  2. నిద్రిస్తున్న ప్రయాణికులకు గుచ్చుకున్న ఇనుప పైపులు
  3. ఆరుగురు అక్కడికక్కడే మృతి
  4. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక యువకుడు
  5.   20 మందికి తీవ్ర గాయాలు
  6. కోదాడ, విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స
  7. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం సీఎం, మంత్రులు 

కోదాడ ఆగస్టు 26 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుం ట సమీపంలో జాతీయ రహదారి-65పై బు ధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Serious road accident) జరిగింది. కోదాడ(Kodad) నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగివున్న కంటైనర్ ను ఢీకొంది. కంటైనర్‌(Container)లోని ఇనుప పైపులు బస్సులో నిద్రిస్తు న్న ప్రయాణికుల కు తాకడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మం దికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను కోదాడ, విజయవాడ ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, మంత్రులు తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని, బాధిత కుటుంబా లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, బీజే పీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు బస్సు డ్రైవర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరా బాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు 42 మంది ప్రయాణికు లతో ప్రైవేట్ బస్సు వెళ్తోంది. కోదాడ వైపు నుంచి విజయవాడ వైపుకి వెళ్తున్న కంటైనర్ లారీ టైర్‌కు పంచర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపైన ఆగిపోయింది. దీంతో కంటైనర్‌లో ఉన్న ఇ నుపపైపులు జారీ కంటైనర్ బాడీ నుంచి వె లుపలికి వచ్చాయి.

అయితే కొంత సమ యం తర్వాత అదే దిశలో తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఏలూరు వైపునకు వే గంగా ట్రావెల్స్ బస్సు దూసుకొచ్చి, కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కంటైనర్ లో ఉన్న ఇనుప పైపులు బస్సులోకి చొచ్చుక కొచ్చి, నిద్రిస్తున్న ప్రయాణికుల తలలకు తగిలాయి. దీంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే సూర్యాపే ట కలెక్టర్ తేజస్ నందలా ల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరు గై న వైద్యం అందించాలని సూచించారు.

పారిశ్రామిక అవసరాలకు ఉపయో గించే భారీ స్తంభాలను ఆ ట్రక్కు మోసుకెళ్తోందని ఎస్పీ నరసింహ మీడియాకు తెలి పారు. ఈ ప్రమాదంతో ఎన్‌హెచ్-65పై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బం ది సహాయక చర్యలు చేపట్టి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. తెల్లవారుజా మున జరిగిన ఈ ఘోర ప్రమాదం కోదాడను ఒక్కసారిగా విషాదంలో ముంచెత్తింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆరు కుటుంబాల్లో అంతులేని రోదన

ఏపీకి చెందిన ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలుకు చెందిన యాసరపు చిన్ని(32), విజయవా డకు చెందిన బొల్లిపంగు మేరీ జ్యోత్స్న(29), కేశవుల నాగేంద్రబాబు(21), సురవరపు షకీనా, కొండూరు భావన, పిడికిటి లక్ష్మి మృతి చెందారు. ఈ విషాదంతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీర య్యాయి. 

సీఎంలు, మంత్రులు, ప్రజాప్రతినధుల తీవ్ర దిగ్భ్రాంతి 

కోదాడ ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చే శారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుం దని భ రోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మె ల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి కూడా ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అలాగే ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబా బు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మం త్రి నారా లోకేశ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూ తి తెలిపారు. కోదాడ ఘటన తీవ్ర దిగ్భ్రా ంతికి గురిచేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ రాష్ట్రచీఫ్ రాంచందర్‌రావు అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించా న్నారు. బాధితులను ప్రభుత్వం అన్ని వి దాలా ఆదుకోవాలని కోరారు.