1 July, 2026 | 6:39 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

13-04-2026 12:02 AM

సికింద్రాబాద్ డీసీసీ సెక్రటరీగా కొమ్ము మోహన్ బాబు

జూబ్లీహిల్స్, ఏప్రిల్ 12 (విజయ క్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు కొమ్ము మోహన్ బాబు డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) సెక్రటరీగా నియమితులయ్యారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం, యువతలో ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ పదవి అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొమ్ము మోహన్ బాబు గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన నియామకంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని నాయ కులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కొమ్ము మోహన్ బాబు మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుం టానని తెలిపారు.

పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తానని, నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు, పార్టీ అధిష్ఠానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరో హించాలని ఆకాంక్షించారు.