ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేయాలి
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, జూన్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా పాలన ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి ప్రజా పాలన ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను వారికి అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
ఉట్నూరు పట్టణాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరుతం పుచ్చుకున్న సర్పంచ్ జాదో అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఉట్నూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తనవే అని చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నాం అని అన్నారు.కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పతకాలను ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే..
ఉట్నూర్ మండలం దంతన్ పల్లి లో పోచమ్మ తల్లి బోనాలు, జాతరకు హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలంతా క్షేమంగా ఉండాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఆలయాల అబివృద్దికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






