11 April, 2026 | 1:39 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి

30-11-2025 12:39 AM

 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ఘట్‌కేసర్, నవంబర్ 29 (విజయక్రాంతి) :  విద్యార్థులు క్రమ శిక్షణతో విద్య ను అభ్యసించడంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శనివారం పోచారం మున్సిపల్ అన్నోజిగూడలోని శ్రీవిద్యా విహార్ స్కూల్ ఆవరణలో లక్ష్య పేరుతో నిర్వహించిన వార్షిక క్రీడా దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు సత్ప్రవర్తనతో పాటు జాతీయ స్ఫూర్తితో విద్యాభ్యాసం చేయాలన్నారు.

స్వామి వివేకానంద, నెల్సన్ మండేలా, అబ్ధుల్ కలాం వంటి మహనీయులు అం దించిన ఆదర్శవంతమైన సందేశాలను ఆచరణీయంగా అనుసరించాలన్నారు. విలువల తో కూడిన విద్యతో విద్యార్థులు రాణించాలన్నారు. భావి పౌరులను తీర్చిదిద్దడంలో పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గ్రేటర్ ఇండియా స్ఫూర్తితో విద్యార్థులు దూసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణమధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీరామ్ భరత్ కుమార్, ప్రిన్సిపాల్ సుచి భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.