11 April, 2026 | 11:54 AM

Breaking News

మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

శిల్పకళా సంపద అబ్బురం

30-11-2025 12:42 AM
  1. రామప్పను సందర్శించిన కరీంనగర్ ఎస్పీఆర్ పాఠశాల విద్యార్థులు
  2. ఆలయ చరిత్రను తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేసిన పిల్లలు
  3. చరిత్రపై అవగాహన పెరుగుతుందన్న ఉపాధ్యాయులు
  4. కట్టడాలు గూర్చి వివరించిన టూరిజం గైడ్ వెంకటేష్

వెంకటాపూర్(రామప్ప), నవంబర్ 29 (విజయక్రాంతి): ములు గు జిల్లా వెంకటపూర్ మండలంలోని ప్రపంచ ప్రఖ్యాత గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో శనివారం విద్యార్థుల సందడి నెలకొంది. కరీంనగర్ ఎస్పీఆర్ పాఠశాల నుంచి రామప్ప సందర్శనకు రాగా.. విద్యార్థులకు ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవం, కట్టడ నిర్మాణ విశిష్టతలను గుర్తు చేస్తూ టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆసక్తికరంగా వివరించారు.

చాలా శతాబ్దాల క్రితం నిర్మించబడిన రామప్ప దేవాలయం ప్రత్యేకతలు, శిల్పాల లోతైన అర్ధాలు, ఎత్తున నృత్యభంగిమల శిల్పాలు, బ్లాక్ బేసాల్ట్ రాయి చెక్కిన గణపతి విగ్రహం వంటి విషయాలను విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన తేలికపాటి ‘ఫ్లోటింగ్ బ్రిక్స్’ గురించి కూడా వెంకటేష్ వివరించగా విద్యార్థులు ఆశ్చర్యంతో స్పందించారు.

రామప్ప చెరువు తీరాన్ని, రామలింగేశ్వర ఆలయం పరిసరాలను విద్యార్థులు సందర్శించారు. ఆలయ గోపురం, గర్భగృహంలోని శిల్పాలు, నర్తకుల ప్రతిమలు చూసి విద్యార్థులు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్శనం ద్వారా విద్యార్థుల్లో భారతీయ శిల్పకళ, చరిత్రపై అవగాహన పెరుగుతోందని ఉపాధ్యాయులు తెలిపారు.