16-02-2026 11:46:55 AM
జన సందోహంతో సాగనంపిన గ్రామస్తులు
పాపన్నపేట,ఫిబ్రవరి16: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో(Sri Edupayala Vana Durga Bhavani Devalayam) మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహించే సంగతి తెలిసిందే. ఇట్టి జాతరలో రెండవ రోజైన సోమవారం ఎడ్ల బండ్ల ప్రదర్శన ఘనంగా జరుగుతుంది.
జాతరలో పాపన్నపేట సంస్థానాధీశుల జోడేడ్ల బండి మొదటగా నడవగా వాటిని అనుసరిస్తూ మిగతా బండ్లు జాతరలో ముందుకు సాగుతాయి. అయితే సోమవారం ఉదయాన్నే పాపన్నపేట గ్రామస్తులు ఘనంగా ఊరేగింపు నిర్వహించి జాతర మహోత్సవానికి జోడెడ్ల బండిని సాగనంపారు. సాయంత్రానికి ఏడుపాయలకు చేరుకున్న సంస్థానాదిశుల బండికి ఈవో వీరేశం, తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా స్వాగతం పలుకుతారు. అనంతరం జోడెడ్ల బండ్ల ఊరేగింపును అట్టహాసంగా నిర్వహిస్తారు. బండ్ల ముందు డప్పు చప్పుల్ల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు.