30 April, 2026 | 5:30 PM

TRS నాకు రాసిపెట్టి ఉందేమో!!

30-04-2026 03:46 PM

టీఆర్ఎస్.. నాకు రాసిపెట్టి ఉందేమో! కవిత

హైదరాబాద్: టీఆర్ఎస్ నాకు రాసిపెట్టి ఉందేమో! అని కల్వకుంట్ల కవితపేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా చేస్తున్న కృషిని కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని సూచించారు. తెలంగాణ రక్షణ సేన పేరుకు ఈసీ ఆమోదంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన.. టీఆర్ఎస్ కు ఈసీ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. సమస్త తెలంగాణ సమాజానికి తెలియచేయడానికి సంతోషిస్తున్నానని కవిత పేర్కొన్నారు. జనవరిలో ఈ సీ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేశామన్నారు. మొత్తం ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామన్నారు. మూడో ప్రాధాన్యతగా ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించిందని కవిత స్పష్టం చేశారు.

కవతి పార్టీపై అభ్యంతరాలుంటే తెలపండి: ఎన్నికల సంఘం

కొత్త పార్టీ పేరు అంశంలో కవితకు ఈసీ లేఖ రాసింది. తెలంగాణ రక్షణ సేన పేరును ఈసీ ప్రాథమికంగా ఖరారు చేసింది. పార్టీ పేరుపై పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని కవితకు ఈసీ సూచించింది. రెండు జాతీయ, రెండు స్థానిక పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని సూచించింది. కొత్త పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే తెలపాలని ఎన్నికల సంఘం కోరింది. 30 రోజుల్లోపు అభ్యంతరాలను తెలపాలని ఎన్నికల సంఘం సూచించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత పార్టీ పేరు ఖరారు చేస్తామని ఈసీ ప్రకటించింది.