16 March, 2026 | 2:17 PM

పోతారంలో ఏడ్ల వెంకటమ్మ ప్రథమ వర్ధంతిలో దుద్దిళ్ల శ్రీనుబాబు

16-03-2026 09:58 AM

మంథని, మార్చి 16 (విజయ క్రాంతి): మంథని మండలంలోని పోతారం గ్రామానికి చెందిన ఏడ్ల శ్రీనివాస్ తల్లి వెంకటమ్మ  ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆదివారం రాత్రి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పాల్గొన్నారు. వెంకటమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. శ్రీను బాబు వెంట ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న,  మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.