ఎస్పీని కలిసిన డిఎస్పి అశోక్
04-05-2026 06:08 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ను ఆసిఫాబాద్ సబ్‌డివిజన్ నూతన డీఎస్పీ బి. అశోక్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు. విధుల నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ శాఖపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా సేవలు అందించాలని ఆదేశించారు.






