17 July, 2026 | 9:01 PM

Breaking News

రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •  

పీజీలో డ్రగ్స్ దందా

22-12-2025 02:34 PM

హైదరాబాద్:  నగరంలోని కో లివింగ్ హాస్టల్ లో మరోసారి డ్రగ్స్ దందా గుట్టు రట్టు అయింది. రాయదుర్గం పరిధి అంజయ్య నగర్ లోని కో లివ్ గెర్నెట్ పీజీలో డ్రగ్స్ దందా కొనసాగుతోంది. రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు(Rajendranagar SOT Police) కోలివ్ గెర్నెట్ పీజీలో తనిఖీలు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులు, ముగ్గురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీకి చెందిన డ్రగ్స్ పెడ్లర్లు వంశీ దిలీప్, బాల ప్రకాష్ గా గుర్తించారు. వినియోగదారులను హైదరాబాద్ కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్ గా గుర్తించారు. పోలీసులు ముగ్గురు వినియోగదారులకు డ్రగ్స్ టెస్టు నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.