ప్రజలకు నిరంతరాయంగా తాగునీటిని అందించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్ / కోటపల్లి, ఆగస్టు 28 : ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా నిరంత రాయంగా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో అమృత్ 2.0 పథకం క్రింద కొనసాగుతున్న నీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రతినిత్యం నిరంతరాయంగా త్రాగునీటిని అందించేందుకు చేపట్టిన అమృత్ 2.0 పథకంలో నీటి ట్యాంక్ నిర్మాణం, పైప్ లైన్ల పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని అధికా రులకు సూచించారు.
మండల కేంద్రంలో కొనసాగుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడ, ఆసుపత్రిలోని పనులను పరిశీలించి వేగవంతం చేయాలని తెలిపారు. మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న అదనపు గదుల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తరగతి గదులు, వంటశాలను పరిశీలించి వంట సిబ్బంది ఆహారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు పాటించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం,
శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిం చాలని తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ లతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రి య, రీ సర్వే నిర్వహణ తీరును పరిశీలించారు. భూముల రీ సర్వే లో భాగంగా జిల్లా లోని ప్రభుత్వ, అటవీ భూములు,
గ్రామాల హద్దుల నిర్ధారణ సమర్థవంతంగా చేపట్టాలని, రెవెన్యూ రికార్డులను సక్రమంగా సిద్ధం చేసి అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం కోటపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసిల్దార్ రాఘవేంద్ర, మండ ల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వర్ రెడ్డి లతో కలిసి ఎస్ ఐ ఆర్, భూముల రీ సర్వే ప్రక్రియ నిర్వహణపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణలో నోటీసుల జారీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, భూముల రీ సర్వే నిర్వహణలో అధికారులు నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని, సర్వే ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాల ని తెలిపారు.






