9 April, 2026 | 3:46 PM

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం :తిలక్

09-04-2026 01:33 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఎండలు మండిపోతున్న నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఖమ్మం శివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత చలివేంద్రాన్ని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ఏ-బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,  3 టౌన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్  యర్రం బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారు.  ఆధ్యాత్మిక విశ్వగురువులు, ది సైంటిఫిక్ సెయింట్ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో 'స్ఫూర్తి కుటుంబం' ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.

​ఈ సందర్భంగా బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజలకు మంచినీరు అందించడం అత్యంత గొప్ప సేవ అని కొనియాడారు. "మనిషిగా పుట్టినందుకు మానవతగా జీవించి, దివ్యతగా ప్రస్థానం సాగించాలి" అన్న గురు విశ్వస్ఫూర్తి గారి సందేశం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. 'మానవతా రక్షితి రక్షితా' అనే నినాదంతో స్ఫూర్తి కుటుంబం సభ్యులు చేస్తున్న ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని తిలక్ తెలిపారు. ​ఈ కార్యక్రమంలో స్ఫూర్తి కుటుంబం ప్రతినిధులు, స్థానిక నాయకులు, ఓబిసి చైర్మన్ బాణాల లక్ష్మణ్ నువ్వుల రవికుమార్ శ్రీలత అనూష , వీరన్న, ప్రసాద్ రావు గారు మహంకాళి మల్లికార్జున్ రావు కనుమలపూడి శ్రీరాములు ధనాల వెంకటరమణ యేసుబైన శ్రీశైలం గూడెపు నాగరాజు తదుర్లు పాల్గొన్నారు . అటుగా వెళ్లే బాటసారులు, వాహనదారులు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.