26 May, 2026 | 1:10 PM

డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!

26-05-2026 12:16 PM

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సిద్ధపూర్ పరిసర గ్రామాల రైతులు 

షాద్ నగర్ మే 26 (విజయక్రాంతి): ఘన ద్రవ వ్యర్ధాల నిర్వహణ యూనిట్ (డంప్ యార్డ్) ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని  షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం  సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో భాగంగా ఆయా గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. కొత్తూరు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఎస్ బి పల్లి అంబటి ప్రభాకర్, సురేష్, ఆగిర్ రవికుమార్ గుప్తా, నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను కలిసి డంపింగ్ యార్డ్ వ్యవహారాన్ని ఆయన ముందు  ప్రస్తావించారు.

ఇదివరకే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తదితర సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు ఎమ్మెల్యే శంకర్ వారికి వివరించారు. తప్పకుండా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో తన వంతు కృషి చేస్తానని, ఇలాంటి పరిస్థితుల్లో కొంత సమయమును పాటించి ఆలోచించాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రసక్తి ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.