రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి
వాంకిడి, (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ జాడి బాపూరావు భౌతిక కాయానికి జిల్లా ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) మంగళవారం నివాళు లర్పించారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయంగా రూ.30 వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబార గ్రామానికి చెందిన బాపూరావు రెబ్బెన పోలీస్ స్టేషన్‌లో హెడ్ కాని స్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
1993 బ్యాచ్‌కు చెందిన ఆయన సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం స్వగ్రామంలో ఆయన భౌతిక కాయానికి జిల్లా ఎస్పీ నితికా పంత్ పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సాను భూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, పోలీస్ సంఘం అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు వేణుగోపాల్, శ్రీనివాస్, వామన మూర్తి, సంజయ్,ఎస్సైలు వెంకటకృష్ణ, మహేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






