6 April, 2026 | 5:51 PM

మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

06-04-2026 04:21 PM

బెజ్జూర్,(విజయక్రాంతి):  బెజ్జూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ సమీపంలో బెజ్జూర్ తాజా మాజీ ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా తెలంగాణ జావిద్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక తహసిల్దార్ రామ్మోహన్రావు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాహ సిల్దార్ మాట్లాడుతూ.. ఎండ వేడిమి నుండి ప్రజలను ఆదుకునేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.

దీంతో ఎండాకాలం బాటసారిలు వాహనదారులకు కార్యాలయానికి వచ్చే కక్షిదారులకు దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిత్యం పరిశుభ్రమైన చల్లటి మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బషరత్ ఖాన్, అమీరుద్దీన్, దుర్గం తిరుపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.