గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ
06-04-2026 04:25 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింగం గౌడ్ చేతుల మీదుగా నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ గృహానికి లబ్ధిదారులైన రంగు వనజ–బాలయ్య దంపతులు కార్యక్రమానికి హాజరైన నాయకులందరినీ ఆహ్వానించి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి అందించిన కానుకను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింగం గౌడ్, స్థానిక సర్పంచ్ గుండు ప్రేమ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తిరుపతి, పరుశురాం, సునీల్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.




